Header Banner

గిరిజన నిరుద్యోగ యువతకు గుడ్‌న్యూస్! విశాఖలో సివిల్స్ ఉచిత కోచింగ్.. ఏపీ ప్రభుత్వ భారీ నిర్ణయం!

  Fri Mar 07, 2025 19:01        Employment

గిరిజన నిరుద్యోగ యువతకు ప్రభుత్వం గుడ్న్యూస్ చెప్పింది. సివిల్స్ పరీక్షకు సంబంధించి ఉచిత కోచింగ్ ఇవ్వనుంది. ఉచిత కోచింగ్ కోసం దరఖాస్తు చేసుకునేందుకు మార్చి 13వ తేదీని ఆఖరి గడువుగా నిర్ణయించింది. ఆసక్తి గల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వం కోరుతుంది. సివిల్ సర్వీస్ పరీక్షలకు సంబంధించి ఏపీ గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో.. ఉచితంగా శిక్షణ ఇవ్వనున్నట్లు ఐటీడీఏ ఇన్చార్జి పీవో అభిషేక్ గౌడ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు.. విశాఖపట్నం జిల్లా వేపగుంట యూత్ ట్రైనింగ్ సెంటర్లో శిక్షణ అందిస్తామని వెల్లడించారు. డిగ్రీ ఉత్తీర్ణులైన ఆసక్తి గల యువత ఈనెల 13 తేదీ లోపు దరఖాస్తు చేసుకోవాలని కోరారు. పాడేరు, సీతంపేట, పార్వతీపురం, రంపచోడవరం, కోటరామచంద్రపురం (కేఆర్ పురం), చింతూరు, నెల్లూరు, శ్రీశైలం లోని ఐటీడీఏ కార్యాలయాల్లో దరఖాస్తు ఫారాలు అందుబాటులో ఉంటాయని తెలిపారు.
స్క్రీనింగ్ టెస్టు..
దీనికి సంబంధించి స్క్రీనింగ్ టెస్ట్ ఉంటుందని, మార్చి 14, 15 తేదీల్లో హాల్ టికెట్లను జారీ చేస్తామని అభిషేక్ వెల్లడించారు. 16న స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహిస్తామని చెప్పారు. మొదటి స్క్రీనింగ్ టెస్ట్లో అర్హత సాధించిన అభ్యర్థులకు ఈనెల 20 నుంచి 22 వరకు రెండో స్క్రీనింగ్ టెస్ట్ కోసం హాల్ టికెట్లను జారీ చేస్తామన్నారు. ఐటీడీఏల పరిధిలో డిగ్రీ ఉత్తీర్ణులైన గిరిజన యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీతో శిక్షణ ఉంటుందని, శిక్షణ సమయంలో వసతి, భోజన సదుపాయం కల్పిస్తామని వివరించారు.


ఇది కూడా చదవండి: వైసీపీకి దిమ్మ తిరిగి సీన్ రివర్స్.. లోకేష్ సంచలన కామెంట్స్.! వేట మొదలైంది.. వారందరికీ జైలు శిక్ష తప్పదు!


విశాఖలో..
పాడేరు, పార్వతీపురం, సీతంపేట, రంపచోడవరం ఐటీడీఏల పరిధిలోని అభ్యర్థులందరికీ విశాఖపట్నంలో సివిల్స్ ఉచిత కోచింగ్ ఉంటుంది. మిగిలిన ఐటీడీఏలకు కూడా ఆయా ప్రాంతాకు సమీపంలో ఉచిత కోచింగ్ సెంటర్లను ఏర్పాటు చేస్తారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని ఉచిత కోచింగ్కు దరఖాస్తు చేసుకోవాలని.. రాష్ట్ర ఎస్టీ సంక్షేమ శాఖ కోరుతోంది. పూర్తి వివరాలు ఆయా ఐటీడీఏలను సంప్రదించాలని సూచించింది.
ఉచిత శిక్షణ.. ఉపాధి..
విశాఖపట్నం పోర్టు అథారిటీ (వీపీఏ), సెంటర్ ఆఫ్ ఎక్స్టెన్స్ ఇన్ మారిటైం షిప్ బిల్డింగ్ (సీఈఎంఎస్) ఆధ్వర్యంలో.. నిరుద్యోగ యువతకి ఉచిత శిక్షణ ఇవ్వనున్నారు. అలాగే శిక్షణ పూర్తి చేసుకున్న తరువాత ఉపాధి కల్పించనున్నారు. కొరియర్ సూపర్ వైజర్, వేర్ హౌస్ ఎగ్జిక్యూటివ్, సీఎన్సీ ఆపరేటర్, డిజైన్ ఇంజినీర్ తదితర కోర్సుల్లో రెండు నుంచి మూడు నెలల పాటు ఉచిత వసతితో పాటు శిక్షణ ఇస్తారు. ఆసక్తి, అర్హత ఉన్న నిరుద్యోగ యువతి నుంచి దరఖాస్తులను కోరుతున్నామని సీఈఎంఎస్ సంస్థ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ గోపీకృష్ణ తెలిపారు.


అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి


దరఖాస్తు చేసుకోవాలి..
ఈ ఉచిత శిక్షణకు 27 ఏళ్ల లోపు వయస్సు గల పదో తరగతి, ఇంటర్మీడియట్, డిగ్రీ, ఐటీఐ ఉత్తీర్ణులైన యువతీ, యువకులు అర్హులని తెలిపారు. ఆసక్తి గల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. విద్యార్హత, కుల ధ్రువీకరణ పత్రాలు, రేషన్ కార్డు, ఆధార్ కార్డు జెరాక్స్ కాఫీల సెట్తో హాజరుకావాల్సి ఉంటుంది. మరిన్ని వివరాల కోసం 7794840934, 8688411100 ఫోన్ నంబర్లను సంప్రదించాలని, లేకపోతే విశాఖపట్నం సింథియా జంక్షన్లో గల సీఈఎంఎస్ కేంద్రంలో సంప్రదించాలని కోరారు.

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

కేదార్‌నాథ్ రోప్‌వేకు గ్రీన్ సిగ్నల్… ఇక ప్రయాణం 36 నిమిషాల్లో పూర్తి! మోడీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం!

 

వైసీపీకి వరుస షాక్ లు.. వంశీ నుంచి మరింత సమాచారం.. బెయిల్​ ఇవ్వొద్దు.!

 

30 ఏళ్ల తర్వాత ఆసక్తికర దృశ్యం.. వెంకయ్యనాయుడులో పవర్, పంచ్‌లు తగ్గలేదు! మా రెండో అబ్బాయికి..

 

మీ ఇంట్లో గ్యాస్ సిలిండర్ ఉందా.అయితే మీకు రెండు శుభవార్తలు! అలా చేస్తే కఠిన చర్యలు..

 

వైఎస్ వివేకా కేసులో షాక్! కీలక సాక్షి మృతి.. విచారణ కొత్త మలుపు!

 

మాజీ మంత్రి రోజాకు షాక్! ఆడుదాం ఆంధ్రా’పై స్వతంత్ర విచారణకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #andhrapravasi #civils #training #coaching #jobs #todaynews #Flashnews #latestnews